Realme: డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో గీక్‌బెంచ్‌పై లిస్టైన Realme 12+ 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme 12+ 5G
  • గీక్‌బెంచ్ పై లిస్టైన Realme 12+ 5G
  • 12జిబి ర్యామ్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme భారత్ లో Realme 12 సిరీస్ ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 12 Pro, Realme 12 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోన్లు సేల్ కి అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, రియల్మీ Realme 12+ 5G అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Realme యొక్క కొత్త డివైజ్ గీక్‌బెంచ్ పై RMX3867 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఈ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 958 పాయింట్లు మరియు మల్టీ-కోర్ టెస్ట్ లో 2346 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Realme కొత్త ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది.
  • గీక్‌బెంచ్ పై ఈ కొత్త ఫోన్ 11.28జిబి ర్యామ్ తో ఉంది. అంటే దీన్ని 12జిబి ర్యామ్ అని అనుకోవచ్చు.
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme 12+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా (గ్లోబల్ మోడల్): Realme 12+ 5G లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
  • కెమెరా (చైనా మోడల్): Realme 12+ 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Realme 12+ 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: Realme 12+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తుందని సమాచారం.
Previous articleTECNO: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా రివీలైన POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్
Next articleRedmi: లీకైన Redmi A3 ధర, రెండర్ ఇమేజ్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.