
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi త్వరలో Redmi A3 అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటి వరకు కంపెనీ నుంచి దీనిపై అధికార ప్రకటన రాలేదు. తాజాగా 91మొబైల్స్ కి Redmi A3 ధర, రెండర్ ఇమేజ్ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ద్వారా అందాయి. దీంతో డివైజ్ యొక్క డిజైన్, కలర్ మోడల్స్ రివీల్ అయ్యాయి. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
Redmi A3 ధర (లీక్)
- Redmi A3 స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- టిప్‌స్టర్ ప్రకారం, Redmi A3 డివైజ్ భారతీయ మార్కెట్ లో రూ.7,000 నుంచి రూ.9,000 మధ్య ఉంటుందని సమాచారం.
- అంటే బేస్ వేరియంట్ రూ.7,000 మరియు టాప్ వేరియంట్ రూ.9,000 ధర ఉండవచ్చు.
- గత మోడల్ Redmi A2 కి అప్‌గ్రేడెడ్ వర్షన్ గా Redmi A3 మార్కెట్ లోకి వస్తోంది.
Redmi A3 డిజైన్
- Redmi A3 లో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంది. స్క్రీన్ మూడు వైపులా బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది.
- Redmi A3 డిస్ప్లే ఫ్లాట్ గా ఉంది. ఎల్సీడీ ప్యానెల్ తో వచ్చే అవకాశం ఉంది.
- Redmi A3 స్మార్ట్‌ఫోన్ 60 హెర్ట్జ్ లేదా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుందని సమాచారం.
- Redmi A3 బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సర్క్యులర్ రింగ్ లో కెమెరా సెన్సర్స్ ఉన్నాయి.
- Redmi A3 లో బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెన్సర్స్ తో పాటు ఒక ఫ్లాష్ లైట్ ఉంది.
- Redmi A3 లో బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో రెడ్మీ బ్రాండింగ్ ఉంది.
- Redmi A3 స్మార్ట్‌ఫోన్ గ్రీన్, బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Redmi A3 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi A3 లో 6.71-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ చిప్సెట్ ఉంటుంది. ఏ చిప్సెట్ అనేది ఇంకా తెలియదు.
- ఓఎస్: Redmi A3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: Redmi A3 డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ తో లాంచ్ కానుంది. భారతీయ మార్కెట్ లో రెడ్మీ సంస్థ మరొక వేరియంట్ ని కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.
- బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Redmi A3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Redmi A3 ధర, లాంచ్ తేదీ
- Redmi A3 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- Redmi A3 డివైజ్ 2024 మార్చి 28 వ తేదీన లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.












