
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Nothing ప్రస్తుతం Phone (2a) ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా ఈ కంపెనీ Nothing Phone (2a) ఇండియా లాంచ్ తేదీని ప్రకటించింది. మార్చి 5న ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. నథింగ్ కంపెనీ డివైజ్ గ్లిమ్స్ ని పరిచయం చేస్తూ ఒక వీడియోని షేర్ చేసింది. వీడియో ప్రకారం, Nothing Phone (2a) డివైజ్ కొత్త కెమెరా మాడ్యూల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
Nothing Phone (2a) డిజైన్
- డిజైన్ విషయంలో మార్కెట్ ని షేక్ చేయాలని Nothing భావిస్తున్నట్లు కార్ల్ పే తెలిపారు.
- Nothing Phone (2a) ఫోన్ పాలికార్బొనేట్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చే అవకాశం ఉంది.
- Nothing Phone (2a) పై పని చేసిన డిజైనర్ క్రిస్ మాట్లాడుతూ, డివైజ్ ట్రాన్స్పరెంట్ డిజైన్ తో రానుందని తెలిపారు.
- డిజైన్ లో భాగంగా గ్లైఫ్ ఎల్ఈడీ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది.
- క్రిస్ షేర్ చేసిన డిజైన్ స్కెచెస్ తప్పితే Nothing Phone (2a) యొక్క పూర్తి గ్లిమ్స్ అందుబాటులో లేవు.
Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1084*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, మాలి జీ610 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) లో 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉంటాయి.
- సాఫ్ట్వేర్: Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
- కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 సెన్సర్ ఉంటుంది.
- బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 4,290 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Nothing Phone (2a) లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.











