Nothing: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన Nothing Phone (2a) ధర, స్పెసిఫికేషన్స్

Highlights

  • వచ్చే నెలలో లాంచ్ కానున్న Nothing Phone (2a)
  • లాంచ్ కి ముందు లీకైన ధర, స్పెసిఫికేషన్స్
  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న Nothing Phone (2a)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Phone (2a) ని లాంచ్ చేయనుంది. గతేడాది లాంచైన Nothing Phone (2) కంటే Nothing Phone (2a) ధర కాస్త తక్కువగా ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో నథింగ్ ఫోన్ కొనాలని భావించే వారు Nothing Phone (2a) లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. సరసమైన ధరలో వస్తున్నప్పటికీ ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంటుందని సమాచారం. తాజాగా లాంచ్ కి ముందు Nothing Phone (2a) ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (లేటెస్ట్ లీక్)

  • Nothing Phone (2a) యొక్క స్పెసిఫికేషన్స్ ని ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ X ద్వారా షేర్ చేశారు. ఆ వివరాలను తెలుసుకుందాం.
  • లీక్ ప్రకారం, Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.
  • Nothing Phone (2a) లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • Nothing Phone (2a) డివైజ్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.

Nothing Phone (2a) ధర (లీక్)

  • లీక్ ప్రకారం, Nothing Phone (2a) డివైజ్ ధర భారత్ లో రూ.30,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Nothing Phone (2) కంటే ఇది రూ.6,000 తక్కువ అని తెలుస్తోంది. భారత్ లో Nothing Phone (2) ప్రారంభ ధర రూ.36,000 గా ఉంది.
  • నథింగ్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పే షేర్ చేసిన యూట్యూబ్ వీడియో ప్రకారం, Nothing Phone (2a) ధర 2022 లో లాంచైన Nothing Phone (1) కంటే చవకగా ఉంటుందని అర్థమవుతోంది.
  • Nothing Phone (2a) యొక్క డిజైన్ కూడా పూర్తి విభిన్నంగా ఉంటుందని సమాచారం.
  • షేర్ కాబడిన వీడియోను బట్టి, రియర్ కెమెరా మాడ్యూల్, గ్లైఫ్ ఇంటర్‌ఫేస్ పూర్తిగా రీడిజైన్ చేయబడినట్లు అర్థమవుతోంది.
  • Nothing Phone (2a) డివైజ్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ తోనే రానుంది.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: Nothing Phone (2a) లో 50ఎంపి శాంసంగ్ ఐసోసెల్ ఎస్5కేజీఎన్9 ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఐసోసెల్ జెన్ఎన్1 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Nothing Phone (2a) ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ తో వస్తోంది.
  • బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 4,290 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • కలర్స్: Nothing Phone (2a) డివైజ్ నలుపు మరియు తెలుపు రంగుల్లో రానుంది.
Previous articleSamsung: రివీలైన Galaxy F15 5G ఫస్ట్ పోస్టర్
Next articleSamsung: రివీలైన Samsung Galaxy M15 5G బ్యాటరీ, చార్జింగ్ వివరాలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.