
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె ఈ ఫోన్ బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. గత మోడల్ Samsung Galaxy M14 5G కి సక్సెసర్ గా Samsung Galaxy M15 5G మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా Samsung Galaxy M15 5G యొక్క బ్యాటరీ, చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy M15 5G బ్యాటరీ వివరాలు (లీక్)
- Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ Dekra మరియు సేఫ్టీ కొరియా సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై EB-BM156ABY అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యిందని GsmArena తన కథనంలో వెల్లడించింది. అంతకుముందు బీఐఎస్ లిస్టింగ్ SM-M156B అనే మోడల్ నంబర్ ని కన్ఫర్మ్ చేసింది.
- ఇక కొరియన్ సైట్స్ లిస్టింగ్‌లో 5,880 ఎంఏహెచ్ బ్యాటరీ కనిపిస్తోంది. దీన్ని బట్టి, Samsung Galaxy M15 5G లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని చెప్పవచ్చు.
- Samsung Galaxy M15 5G 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సర్టిఫికేషన్ ద్వారా కన్ఫర్మ్ అవుతోంది.
- Samsung Galaxy M15 5G డివైజ్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు ఇదివరకే లీక్స్ ద్వారా తెలిసింది.
- Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy A15 5G కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy M15 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57-ఎంపీ2 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M15 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంటుంది.
- కెమెరా: Samsung Galaxy M15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎండి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy M15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy M15 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉండవచ్చు.











