Infinix: 32MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Hot 40i

Highlights

  • నేడు భారత్ లో లాంచైన Infinix Hot 40i
  • 16జిబి ర్యామ్ పవర్ తో వచ్చిన డివైజ్
  • Infinix Hot 40i ధర రూ.9,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో Hot 40i డివైజ్ ని లాంచ్ చేసింది. సెగ్మెంట్ లో 32ఎంపి సెల్ఫీ కెమెరా గల మొదటి ఫోన్ గా Infinix Hot 40i నిలిచింది. Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్ పవర్, 256జిబి స్టోరేజీ, 50ఎంపి ఏఐ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Infinix Hot 40i డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Hot 40i ధర, లభ్యత

  • Infinix Hot 40i డివైజ్ ధర భారతీయ మార్కెట్ లో బ్యాంక్ ఆఫర్లతో కలుపుకుని రూ.8,999 కి లభిస్తుంది.
  • Infinix Hot 40i డివైజ్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫిబ్రవరి 21 నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
  • Infinix Hot 40i హ్యాండ్సెట్ పామ్ బ్లూ, స్టార్‌ఫాల్ గ్రీన్, హరైజన్ గోల్డ్ మరియు స్టార్‌లిట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Hot 40i స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Hot 40i లో 6.5-ఇంచ్ ఐపీఎల్సీడీ స్క్రీన్, 1612*712 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్, 89.7% స్క్రీన్-టు-బాడీ రేషియో, డీసీఐ-పీ3 వైడ్ కలర్ గేముత్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Hot 40i లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ1 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 40i డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 16జిబి వరకు ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ ద్వారా 1టిబి వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Infinix Hot 40i లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్, క్వాడ్ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ లో డ్యూయల్ ఫ్లాష్ కూడా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Infinix Hot 40i లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Infinix Hot 40i లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Infinix Hot 40i డివైజ్ 163.59 మి.మీ పొడవు, 75.5 మి.మీ వెడల్పు, 8.30 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.
  • కలర్స్: Infinix Hot 40i డివైజ్ పామ్ బ్లూ, స్టార్‌ఫాల్ గ్రీన్, హరైజన్ గోల్డ్ మరియు స్టార్‌లిట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix Hot 40i లో మ్యాజిక్ రింగ్, డీటీఎస్ 200% సూపర్ వాల్యూమ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎక్స్‌బూస్ట్ గేమింగ్ ఇంజన్, అల్ట్రా పవర్ సేవింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.