
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో V30, V30 Pro డివైజెస్ ని లాంచ్ చేయనుంది. భారత్ లో వివో వీ-సిరీస్ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో యూజర్లు ఈ సిరీస్ లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా MySmartPrice వెబ్‌సైట్ Vivo V30 సిరీస్ ఇండియా రిటైల్ పోస్టర్ ని తన కథనం ద్వారా షేర్ చేసింది. పోస్టర్ ద్వారా కొన్ని కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Vivo V30, V30 Pro రిటైల్ పోస్టర్ (లీక్)
- లీక్ ప్రకారం, Vivo V30 Pro లో 6 విభిన్నమైన జీస్ స్టైల్ పోట్రెయిట్ మోడ్స్ రివీల్ అయ్యాయి. ఈ మోడ్స్ ద్వారా పగలు, రాత్రి మెరుగైన కెమెరా అనుభూతిని పొందవచ్చు.
- జీస్ సినీ-ఫ్లేర్ పొట్రెయిట్, సినీమాటిక్, బయోటార్, ప్లేనార్, డిస్టాగన్ మరియు సోనార్ వంటి మోడ్స్ ఉంటాయని సమాచారం.
- పొట్రెయిట్ మోడ్ ఫోటోస్ తో పాటు వీడియోలలో కూడా ఉంటుంది. జీస్ సినీమాటిక్ వీడియో బొకే మరియు జీస్ నేచురల్ కలర్ మోడల్ వంటివి Vivo V30 Pro లో లభిస్తాయి.
- క్రింద ఇవ్వబడిన ఇమేజ్ ని గమనిస్తే, Vivo V30 సిరీస్ ‘త్వరలో వస్తోంది’ అని తెలియజేస్తోంది. అంటే అతి త్వరలో భారత్ లో ఈ సిరీస్ లాంచ్ ఉండనుందని అర్థమవుతోంది.
Vivo V30 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Vivo V30 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Vivo V30 Pro లో జీస్ లెన్స్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
- బ్యాటరీ: Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Vivo V30 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ54 రేటింగ్ ఉంటాయి.












