
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈసారి ఫోన్ డిజైన్ తో పాటు డిస్ప్లే, మెమొరీ, సాఫ్ట్వేర్ వివరాలు కూడా లిస్టింగ్ ద్వారా తెలిసాయి. గూగుల్ ప్లే కన్సోల్ కంటే ముందు ఇతర సర్టిఫికేషన్ వెబ్సైట్స్ మరియు బెంచ్మార్క్ సైట్స్ పై Samsung Galaxy A35 5G లిస్ట్ అయ్యింది. అంతేకాదు, Samsung Galaxy A35 5G డివైజ్ శాంసంగ్ అధికార వెబ్సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది.
Samsung Galaxy A35 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్
- Samsung Galaxy A35 5G స్మార్ట్ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై SM-A356E అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యిందని MySmartPrice తన కథనం ద్వారా తెలిపింది.
- గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ని గమనిస్తే, ఫోన్ పంచ్-హోల్ కటౌట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై 3 కెమెరా సెన్సర్స్ పైన ఎడమవైపున నిలువుగా కనిపిస్తున్నాయి.
- Samsung Galaxy A35 5G డివైజ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ68 జీపీయూ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై Samsung Galaxy A35 5G హ్యాండ్సెట్ 6జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, 450 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ వంటి స్పెసిఫికేషన్స్ తో కనిపించింది.
Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుందని గీక్బెంచ్ వెబ్సైట్ ద్వారా తెలిసింది.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ర్యామ్ మరియు స్టోరేజీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
- కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A35 5G డివైజ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది.
- ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్యూఐ 6 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.











