Realme 12+ 5G ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ షేర్ చేసిన రియల్మీ

Highlights

  • కొత్త ఫోన్ టీజర్ షేర్ చేసిన రియల్మీ
  • Realme 12+ 5G అని దాదాపు ఖరారు
  • 12జిబి+256జిబి సపోర్ట్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో భారతీయ మార్కెట్ లో Realme 12+ 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా రియల్మీ సంస్థ ఇండియా లాంచ్ ని టీజ్ చేసింది. అయితే టీజర్ లో ఫోన్ పేరు తెలపలేదు. అయితే Realme 12+ 5G అని దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. భారత్ లో Realme 12+ 5G డివైజ్ ఫిబ్రవరి 29న లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓసారి Realme 12+ 5G ఇండియా లాంచ్ టీజర్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G ఇండియా లాంచ్ టీజర్

  • Realme సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై ఒక కొత్త ఫోన్ టీజర్ ని షేర్ చేసింది.
  • తన పోస్ట్ కి ‘వన్‌మోర్‌ప్లస్’ అనే హ్యాష్‌ట్యాగ్ ని జతచేసింది. దీంతో ఈ ఫోన్ Realme 12+ 5G అని అర్థమైపోతుంది.
  • Realme 12+ 5G డివైజ్ మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో తీసుకురాబోతున్నట్లు సమాచారం.
  • రియల్మీ కంపెనీ వెబ్‌సైట్ లో ప్రస్తుతం Realme 12+ 5G మైక్రోసైట్ దర్శనమిస్తోంది. దీంట్లో ఫోన్ గ్రీన్ కలర్ లో కనిపిస్తోంది. అలాగే బ్యాక్ ప్యానెల్ లెదర్ ఫినిష్ తో పాటు వర్టికల్ స్ట్రాప్ ని కలిగి ఉంది.
  • Realme 12+ 5G ఫోన్ 12 కొత్త అప్‌గ్రేడ్స్ తో వస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.
  • Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ మలేషియాలో ఫిబ్రవరి 29న లాంచ్ కానుందని కన్ఫర్మ్ అయ్యింది. అదే రోజున భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Realme 12+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా (గ్లోబల్ మోడల్): Realme 12+ 5G లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
  • కెమెరా (చైనా మోడల్): Realme 12+ 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Realme 12+ 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: Realme 12+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తుందని సమాచారం.
  • కనెక్టివిటీ: Realme 12+ 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
Previous articleOnePlus: లాంచ్‌కి ముందు లీకైన OnePlus Nord N30 SE 5G యురోపియన్ మార్కెట్ ధర
Next articleSamsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy A35 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.