Lava: బీఐఎస్, ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్‌ సైట్స్‌పై లిస్టైన Lava Z34, రివీలైన స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Lava Z34
  • Lava Z34 మోడల్ నంబర్ LEX401
  • 4,950 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో భారతీయ కస్టమర్ల కోసం ఒక కొత్త చవకైన ఫోన్ ని తీసుకురానుంది. Lava Z34 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్ మరియు బీఐఎస్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Lava Z34 కి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Lava Z34 ఎఫ్‌సీసీ లిస్టింగ్

 

  • లావా నుంచి రాబోవు కొత్త ఫోన్ ఎఫ్‌సీసీ ప్లాట్ఫామ్ పై LEX401 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ఇమేజ్ కూడా రివీల్ అయ్యింది.
  • Lava Z34 డివైజ్ ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ రౌండెడ్ ఎడ్జెస్ ని కలిగి ఉంది.
  • Lava Z34 స్మార్ట్‌ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ట్రిపుల్ కెమెరా సెటప్, పంచ్-హోల్ కటౌట్ తో రానున్నట్లు తెలుస్తోంది.
  • Lava Z34 లో పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్స్ కుడివైపున ఉన్నాయి. ఎడమవైపున సిమ్ ట్రే ఉంది.
  • Lava Z34 లో సింగిల్ స్పీకర్ గ్రిల్, యూఎస్బీ టైప్-సీ, 3.5ఎంఎం ఆడియో జాక్ బాటమ్ లో ఉన్నాయి.
  • Lava Z34 డివైజ్ మీడియాటెక్ హీలియో జీ35 లేదా పీ35 చిప్సెట్ తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Lava Z34 డివైజ్ 4,950 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం.
  • Lava Z34 హ్యాండ్సెట్ 164మి.మీ పొడవు, 76మి.మీ వెడల్పు, 8మి.మీ మందం ఉంటుంది.

Lava Z34 గీక్‌బెంచ్, బీఐఎస్ లిస్టింగ్

 

  • Lava Z34 డివైజ్ గీక్‌బెంచ్ మరియు బీఐఎస్ లిస్టింగ్స్ పై LEX401 అనే మోడల్ నంబర్ తో లిస్టైంది.
  • గీక్‌బెంచ్ డేటాబేస్ పై లావా స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 175 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 648 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Lava Z34 డివైజ్ 4జిబి ర్యామ్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Lava Z34 లో మీడియాటెక్ జీ35/పీ35 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • బీఐఎస్ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.
Previous articleSamsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy A35 5G
Next articleVivo: 120W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Vivo Y100t 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.