
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనీస్ మార్కెట్ లో Y100t 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కంటే ముందు Y100, Y100i ఫోన్లు చైనాలో లాంచ్ చేసింది. రెండు ఫోన్లు కూడా గతేడాది మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా Vivo Y100t 5G డివైజ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
Vivo Y100t 5G ధర
- Vivo Y100t 5G డివైజ్ ధర ఇంకా ఖరారు కాలేదు. ఈ ఫోన్ ధర ఫిబ్రవరి 23న తెలుస్తుంది.
- వివో చైనా వెబ్‌సైట్, జేడీ.కామ్ మరియు టీమాల్ ద్వారా Vivo Y100t 5G డివైజ్ సేల్ కి రానుంది.
Vivo Y100t 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo Y100t 5G లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo Y100t 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Vivo Y100t 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ఓఎస్: Vivo Y100t 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Vivo Y100t 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Vivo Y100t 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.
- బరువు, చుట్టుకొలత: Vivo Y100t 5G డివైజ్ 164.58 మి.మీ పొడవు, 75.8 మి.మీ వెడల్పు, 8.79 మి.మీ మందం, 200 గ్రాముల బరువు ఉంటుంది.
- కలర్ ఆప్షన్స్: Vivo Y100t 5G డివైజ్ తెలుపు మరియు నీలం రంగుల్లో లభిస్తుంది.
- కనెక్టివిటీ: Vivo Y100t 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.











