
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy F15 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా Samsung Galaxy F15 యొక్క ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. నెట్టింట్లో ప్రత్యక్షమైన లీక్ ద్వారా ఇండియా లాంచ్ ఖరారవ్వడంతోపాటు, లాంచ్ తేదీ కూడా రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy F15 లాంచ్ తేదీ (లీక్)
- Samsung Galaxy F15 స్మార్ట్ఫోన్ కి సంబంధించిన లాంచ్ వివరాలు Smartprix అనే వెబ్సైట్ ద్వారా రివీల్ అయ్యాయి.
- Samsung Galaxy F15 డివైజ్ ఫిబ్రవరి 22న భారత్ లో లాంచ్ కానుందని లీక్స్ ద్వారా స్పష్టమవుతోంది.
- Samsung Galaxy F15 డివైజ్ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ కి వస్తోందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy F15 ప్రోమో పోస్టర్
- Samsung Galaxy F15 డివైజ్ యొక్క ప్రోమో పోస్టర్ ని రీసెంట్ గా SmartPrix రివీల్ చేసింది. దీంతో Samsung Galaxy F15 యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.
- Samsung Galaxy F15 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో రానుందని లీక్ ద్వారా తెలిసింది.
- Samsung Galaxy F15 లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని స్మార్ట్ప్రిక్స్ ద్వారా రివీల్ అయ్యింది.
Samsung Galaxy F15 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy F15 5G లో అమోలెడ్ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉంటాయని సమాచారం. స్క్రీన్ సైజ్ వివరాలు ఇంకా తెలియలేదు.
- ప్రాసెసర్: Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది. గరిష్టంగా 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.
- కెమెరా: Samsung Galaxy F15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy F15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy F15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.











