
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో తొలుత మార్కెట్ లోకి iQOO Z9 5G ఎంట్రీ ఇవ్వబోతోంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ భారత్‌కి చెందిన బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ ద్వారా iQOO Z9 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
iQOO Z9 5G గీక్‌బెంచ్ లిస్టింగ్
- iQOO Z9 5G డివైజ్ గీక్‌బెంచ్ పై I2302 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్టున్నట్లు గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.
- iQOO Z9 5G డివైజ్ లిస్టింగ్ పై 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో కనిపిస్తోంది.
- iQOO Z9 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1186 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2683 పాయింట్లు స్కోర్ చేసింది.
iQOO Z9 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: iQOO Z9 5G లో 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా వేస్తున్నారు.
- ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది. అయితే ఒక లీక్ ప్రకారం, ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 లేదా డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
- ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 5G డివైజ్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది.
- కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
- ఓఎస్: iQOO Z9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ తో రానుంది.
- కనెక్టివిటీ: iQOO Z9 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.












