
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ డివైజ్ Xiaomi 14 ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా షావోమి Xiaomi 14 భారత లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అవుతోంది. మార్చి 7 వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. సరే, ఓసారి లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Xiaomi 14 లాంచ్ తేదీ
- Xiaomi 14 లాంచ్ తేదీని షావోమి ఇండియా అధికారికంగా తన X ఖాతా ద్వారా వెల్లడించింది.
- Xiaomi 14 భారతీయ మార్కెట్ లో మార్చి 7న లాంచ్ అవుతోంది. ఇప్పటికే షావోమి ఈ ఫోన్ లాంచ్ ని టీజ్ చేస్తూ వస్తోంది. తాజా అప్డేట్ తో లాంచ్ తేదీపై స్పష్టత వచ్చింది.
- Xiaomi 14 లాంచ్ కోసం షావోమి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓసారి డివైజ్ అంచనా ధర వివరాలను తెలుసుకుందాం పదండి.
Lighting up a path for the coming legend.? #Xiaomi14 is ready to capture all the illuminating moments.
Stay tuned! #XiaomixLeica pic.twitter.com/BRYufAC8D6
— Xiaomi India (@XiaomiIndia) February 19, 2024
Xiaomi 14 భారత మార్కెట్ ధర (అంచనా)
- Xiaomi 14 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చైనాలో సేల్‌కి అందుబాటులో ఉంది. అక్కడ ఈ ఫోన్ 4 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
- Xiaomi 14 చైనా మార్కెట్ ప్రారంభ ధర 3999 యువాన్లు (సుమారు రూ.46,000) గా ఉంది.
- భారత్ లో Xiaomi 14 ప్రారంభ ధర రూ.40,000 తో మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.
- భారత్ కి Xiaomi 14 1టిబి వేరియంట్ ని తీసుకురాకపోవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
Xiaomi 14 స్పెసిఫికేషన్స్ (చైనా)
- స్క్రీన్: Xiaomi 14 లో 6.36-ఇంచ్ పంచ్-హోల్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2670*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 2160 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉంటాయి.
- ప్రాసెసర్: Xiaomi 14 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉంటాయి.
- రియర్ కెమెరా: Xiaomi 14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
- ఫ్రంట్ కెమెరా: Xiaomi 14 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,610 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ మరియు 50 వాట్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Xiaomi 14 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, యూఎస్బీ టైప్-సీ 3.2 జెన్ 1 ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: Xiaomi 14 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ68 రేటింగ్ ఉంటాయి.











