OnePlus: బీఐఎస్ పై లిస్టైన కొత్త వన్‌ప్లస్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • బీఐఎస్ పై లిస్టైన కొత్త వన్‌ప్లస్ ఫోన్
  • మోడల్ నంబర్: CPH2163
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ డివైజ్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. గతంలో 91మొబైల్స్ ఈ ఫోన్ కి సంబంధించిన రెండర్స్ ని షేర్ చేసింది. ఇక బీఐఎస్ పై ఈ కొత్త వన్‌ప్లస్ డివైజ్ CPH2163 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. అయితే డివైజ్ పేరేంటో ఇంకా తెలియలేదు. త్వరలోనే పేరు రివీల్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి ఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్ యొక్క బీఐఎస్ వివరాలు, రెండర్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

OnePlus CPH2163 బీఐఎస్ లిస్టింగ్

  • వన్‌ప్లస్ నుంచి రాబోవు కొత్త డివైజ్ తాజాగా ఇండియన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై CPH2163 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • అయితే బీఐఎస్ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా పేరు, ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.
  • త్వరలో వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికార ప్రకటన రానున్న రోజుల్లో వెలువడవచ్చు.

OnePlus కొత్త ఫోన్ రెండర్స్ (లీక్)

  • కొన్ని రోజుల క్రితం వన్‌ప్లస్ కొత్త ఫోన్ యొక్క రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.
  • రెండర్స్ ప్రకారం, ఈ ఫోన్ పంచ్-హోల్ కటౌట్, గ్లాసీ రియర్ ప్యానెల్, ఫ్లాట్ డిస్ప్లే, ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • ఈ వన్‌ప్లస్ కొత్త ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తున్నట్లు ఫింగర్‌ప్రింట్ యానిమేషన్ ద్వారా తెలుస్తోంది.
  • ఈ డివైజ్ అమోలెడ్ డిస్ప్లే తో రావొచ్చని అంచనా వేస్తున్నారు.
  • ఇక ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • కొత్త వన్‌ప్లస్ డివైజ్ లో సిమ్ ట్రే విభాగం, ప్రైమరీ మైక్రోఫోన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ బాటమ్ లో ఉన్నాయి.
  • వన్‌ప్లస్ ఫోన్ లో సెకండరీ మైక్రోఫోన్, ఐఆర్ బ్లాస్టర్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ టాప్ లో ఉన్నాయి.
  • ఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్ లో కుడివైపున వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ లో అలర్ట్ స్లైడర్ కూడా ఉంది.

OnePlus CPH2613 కెమెరా లిస్టింగ్

  • OnePlus CPH2613 డివైజ్ కెమెరా FV-5 సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. దీంతో కెమెరా విభాగం వివరాలు రివీల్ అయ్యాయి.
  • OnePlus CPH2613 ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 4096*3072 పిక్సెల్స్ రెజుల్యూషన్, 5.6ఎంఎం ఫోకల్ లెంగ్త్, ఓఐఎస్+ఈఐఎస్ ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా, ఈఐఎస్ మరియు 2304*1728 పిక్చర్ రెజుల్యూషన్ సపోర్ట్ ఉన్నాయి.
Previous articleXiaomi: మార్చి 7న భారత్‌లో లాంచ్ అవుతోన్న Xiaomi 14
Next articleNothing: మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్‌తో వస్తోన్న Phone (2a)
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.