
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ డివైజ్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. గతంలో 91మొబైల్స్ ఈ ఫోన్ కి సంబంధించిన రెండర్స్ ని షేర్ చేసింది. ఇక బీఐఎస్ పై ఈ కొత్త వన్‌ప్లస్ డివైజ్ CPH2163 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. అయితే డివైజ్ పేరేంటో ఇంకా తెలియలేదు. త్వరలోనే పేరు రివీల్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి ఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్ యొక్క బీఐఎస్ వివరాలు, రెండర్ విశేషాలను తెలుసుకుందాం పదండి.
OnePlus CPH2163 బీఐఎస్ లిస్టింగ్
- వన్‌ప్లస్ నుంచి రాబోవు కొత్త డివైజ్ తాజాగా ఇండియన్ సర్టిఫికేషన్ వెబ్సైట్ బీఐఎస్ పై CPH2163 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- అయితే బీఐఎస్ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా పేరు, ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.
- త్వరలో వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికార ప్రకటన రానున్న రోజుల్లో వెలువడవచ్చు.
OnePlus కొత్త ఫోన్ రెండర్స్ (లీక్)
- కొన్ని రోజుల క్రితం వన్‌ప్లస్ కొత్త ఫోన్ యొక్క రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.
- రెండర్స్ ప్రకారం, ఈ ఫోన్ పంచ్-హోల్ కటౌట్, గ్లాసీ రియర్ ప్యానెల్, ఫ్లాట్ డిస్ప్లే, ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- ఈ వన్‌ప్లస్ కొత్త ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తున్నట్లు ఫింగర్‌ప్రింట్ యానిమేషన్ ద్వారా తెలుస్తోంది.
- ఈ డివైజ్ అమోలెడ్ డిస్ప్లే తో రావొచ్చని అంచనా వేస్తున్నారు.
- ఇక ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
- కొత్త వన్‌ప్లస్ డివైజ్ లో సిమ్ ట్రే విభాగం, ప్రైమరీ మైక్రోఫోన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ బాటమ్ లో ఉన్నాయి.
- వన్‌ప్లస్ ఫోన్ లో సెకండరీ మైక్రోఫోన్, ఐఆర్ బ్లాస్టర్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ టాప్ లో ఉన్నాయి.
- ఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్ లో కుడివైపున వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ లో అలర్ట్ స్లైడర్ కూడా ఉంది.
OnePlus CPH2613 కెమెరా లిస్టింగ్
- OnePlus CPH2613 డివైజ్ కెమెరా FV-5 సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. దీంతో కెమెరా విభాగం వివరాలు రివీల్ అయ్యాయి.
- OnePlus CPH2613 ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 4096*3072 పిక్సెల్స్ రెజుల్యూషన్, 5.6ఎంఎం ఫోకల్ లెంగ్త్, ఓఐఎస్+ఈఐఎస్ ఉన్నాయి.
- ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా, ఈఐఎస్ మరియు 2304*1728 పిక్చర్ రెజుల్యూషన్ సపోర్ట్ ఉన్నాయి.












