Nothing: మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్‌తో వస్తోన్న Phone (2a)

Highlights

  • మార్చి 5న భారత్‌లో లాంచ్ కానున్న Nothing Phone (2a)
  • తాజాగా చిప్సెట్ వివరాలు వెల్లడించిన కంపెనీ
  • డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing తన తదుపరి ఫోన్ Phone (2a) ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 5న ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. నథింగ్ లవర్స్ ఈ డివైజ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నేడు, నథింగ్ సంస్థ మరొక శుభవార్తను తన ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చింది. చిప్సెట్, ర్యామ్ వివరాలను నథింగ్ వెల్లడించింది. Nothing Phone (2a) డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ తో రానుందని నథింగ్ తెలిపింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) ప్రాసెసర్, ర్యామ్ వివరాలు

  • Nothing Phone (2a) లో వాడనున్న చిప్సెట్ వివరాలను నథింగ్ సంస్థ తన X ఖాతా ద్వారా వెల్లడించింది.
  • Nothing Phone (2a) డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని గరిష్ట క్లాడ్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్. 741,999 అంటుటు స్కోర్ సాధించింది.
  • Nothing Phone (2a) 8జిబి ర్యామ్ బూస్టర్ టెక్నాలజీతో వస్తోంది.
  • Nothing Phone (2a) డివైజ్ 12జిబి ఫిజికల్ ర్యామ్ తో లాంచ్ కానుంది. వర్చువల్ ర్యామ్ తో కలిపితే గరిష్టంగా 20జిబి ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.