
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్ని లాంచ్ చేయనుంది. Moto G Power 5G (2024) పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. త్వరలో లాంచ్ కాబోవు ఈ స్మార్ట్ఫోన్ యొక్క 5కే క్యాడ్ రెండర్స్ మరియు 360-డిగ్రీ వీడియో mspoweruser ద్వారా లీక్ అయ్యాయి. దీంతో ఫోన్ లుక్ బయటకు వచ్చింది. Moto G Power 5G (2024) కలర్ ఆప్షన్స్ కూడా రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Moto G Power 5G (2024) రెండర్స్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Moto G Power 5G (2024) రెండర్స్
- Moto G Power 5G (2024) డివైజ్ రెండర్స్ ద్వారా కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ ఆర్కిడ్ టింట్ మరియు ఔటర్ స్పేస్ కలర్ ఆప్సన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- Moto G Power 5G (2024) డివైజ్ రెండర్స్ ని గమనిస్తే, ముందువైపు సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉంది.
- Moto G Power 5G (2024) డివైజ్ సన్నని బెజెల్స్, బాటమ్ లో చిన్ ని కలిగి ఉంది.
- Moto G Power 5G (2024) డివైజ్ కి కుడివైపున పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ ఉన్నాయి. బాటమ్ లో యూఎస్బీ టైప్ సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ మరియు 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
- Moto G Power 5G (2024) బ్యాక్ ప్యానెల్ పై కెమెరా మాడ్యూల్ లో రెండు కెమెరాలు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై మధ్యలో మోటోరోలా బ్రాండింగ్ ఉంది.
Moto G Power 5G (2024) స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Moto G Power 5G (2024) లో 6.7-ఇంచ్ డిస్ప్లే ఉంటుందని తెలుస్తోంది. 1200*1600 పిక్సెల్స్ హెచ్డీ+ రెజుల్యూషన్ కి ఈ ఫోన్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుందని MSPowerUser తన కథనం ద్వారా తెలిపింది.
- బ్యాటరీ, చార్జింగ్: Moto G Power 5G (2024) డివైజ్ 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. అయితే బ్యాటరీ కెపాసిటీ ఎంతో ఇంకా తెలియలేదు.
- చుట్టుకొలత: Moto G Power 5G (2024) ఫోన్ 167.3 మి.మీ పొడవు, 76.4 మి.మీ వెడల్పు, 8.5 మి.మీ మందం ఉంటుంది.
Moto G Power 5G (2024) డివైజ్ యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.











