
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలో భారతీయ మార్కెట్ లో Z9 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీ తాజాగా ఖరారైంది. మార్చి 12న iQOO Z9 5G ఇండియాలో లాంచ్ అవుతోంది. దీంతో ఐకూ లవర్స్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకూ ఇండియా సోషల్ మీడియా చానల్స్ ద్వారా iQOO Z9 5G ఇండియా లాంచ్ తేదీని ప్రకటించింది. సరే, ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
వారం క్రితం ఐకూ సంస్థ, iQOO Z9 5G యొక్క టీజర్ ని వదిలింది. దీని ద్వారా మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ కన్ఫర్మ్ అయ్యింది. ఇకపోతే ఈ ఫోన్ అమెజాన్ ద్వారా విక్రయానికి వస్తోంది.
iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ సెన్సర్ ఉంటుంది. సెగ్మెంట్ లో ఈ సెన్సర్ తో వస్తోన్న మొదటి ఐకూ ఫోన్ iQOO Z9 5G అని కంపెనీ చెబుతోంది.
iQOO Z9 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: iQOO Z9 5G లో 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా వేస్తున్నారు.
- ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది. అయితే ఒక లీక్ ప్రకారం, ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 లేదా డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
- ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 5G డివైజ్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది.
- కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
- ఓఎస్: iQOO Z9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ తో రానుంది.
- కనెక్టివిటీ: iQOO Z9 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.












