
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన నంబర్ సిరీస్‌కు మరొక మోడల్‌ని జత చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ Realme 12 5G పేరుతో మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్ లో Realme 12 Pro, Realme 12 Pro Plus డివైజెస్ అందుబాటులో ఉన్నాయి. మరోవైపు Realme 12+ 5G మార్చి 6న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈలోపు Realme 12 5G బీఐఎస్, ఎఫ్‌సీసీ, ఈఈసీ, టీకేడీఎన్, ఎస్ఐఆర్ఐఎమ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి అవేంటో తెలుసుకుందాం.
Realme 12 5G లిస్టింగ్ వివరాలు
- Realme 12 5G డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్ పై RMX3999 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- టీయూవీ రెయిన్‌ల్యాండ్ లిస్టింగ్ పై 4,880 ఎంఏహెచ్ బ్యాటరీతో Realme 12 5G కనిపించింది. అంటే ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అని అంచనా వేయవచ్చు.
- ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై Realme 12 5G డివైజ్ యొక్క మోడల్ నంబర్, పేరు కన్ఫర్మ్ అయ్యాయి.
- Realme 12 5G ఫోన్ ఈఈసీ, టీకేడీఎన్, ఇండోనేషియా టెలీకామ్ సర్టిఫికేషన్ సైట్స్ పై RMX3999 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- FCC లిస్టింగ్ పై 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్స్ రివీల్ అయ్యాయి.
- ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ తో Realme 12 5G వస్తున్నట్లు ఎఫ్‌సీసీ ద్వారా రివీల్ అయ్యింది.
- ఎఫ్‌సీసీ ప్లాట్ఫామ్ పై Realme 12 5G ఫోటో కూడా కనిపించింది. బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ మాడ్యూల్ తో ఫోన్ కనిపిస్తోంది.
Realme 12 5G కెమెరా ఎఫ్‌వీ-5 లిస్టింగ్
- Realme 12 5G డివైజ్ కెమెరా ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్ లిస్టింగ్ పై కనిపించింది.
- లిస్టింగ్ ప్రకారం, Realme 12 5G డివైజ్ f/1.8 అపర్చర్, 5.2ఎంఎం ఫోకల్ లెంగ్త్, జెపీఈజీ ఇమేజ్ ఫార్మాట్ కి సపోర్ట్ చేస్తుంది.
- Realme 12 5G డివైజ్ f/2.0 అపర్చర్, 2.6ఎంఎం ఫోకల్ లెంగ్త్ సపోర్ట్ తో వస్తోంది.











