
స్మార్ట్ఫోన్లతో పాటు ఫీచర్ ఫోన్లను తయారు చేసే Itel సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో itel P55T స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఎంట్రీ-లెవెల్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ డివైజ్‌ని తీసుకొచ్చారు. యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14 (గో ఎడిషన్) తో వచ్చిన ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ itel P55T కావడం విశేషం. సరే, ఓసారి itel P55T భారత మార్కెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
itel P55T ధర, సేల్ వివరాలు
itel P55T స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ధర వివరాలు చూద్దాం.
itel P55T 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.8,199 గా నిర్ణయించారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.
itel P55T స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
- డిస్ప్లే: itel P55T లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి. డైనమిక్ బార్ నోటిఫికేషన్స్ ఫీచర్ ఈ ఫోన్ లో అందించారు.
- ప్రాసెసర్: itel P55T స్మార్ట్‌ఫోన్ లో యూనిఓఎస్ఓసీ టీ606 ప్రాసెసర్, మాలి జీ57 జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: itel P55T డివైజ్ 4జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
- సాఫ్ట్వేర్: itel P55T డివైజ్ ఆండ్రాయిడ్ 14 (గో ఎడిషన్) పై పని చేస్తుంది.
- కెమెరా: itel P55T లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: itel P55T లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు.
- భద్రత: itel P55T లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
- ఆడియో: itel P55T డివైజ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంది.
- కలర్ ఆప్షన్స్: itel P55T డివైజ్ బ్రిలియంట్ గోల్డ్, అరోరా బ్లూ మరియు ఆస్ట్రల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











