
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ గా Vivo V30 సిరీస్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు అందరూ భారత మార్కెట్ లో ఈ సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు. భారత్ లో వివో వీ-సిరీస్ కి ఎంతోమంది అభిమానులున్నారు. మార్చి 7న ఇండియన్ మార్కెట్ లో Vivo V30 సిరీస్ ఎంట్రీ ఇస్తోంది. ఈలోపు వివో వీ30 సిరీస్ భారత మార్కెట్ ధరలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
Vivo V30, Vivo V30 Pro ధరలు (లీక్)
- ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Vivo V30 సిరీస్ ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పై రివీల్ చేశారు.
- బేస్ మోడల్ వివో వీ30 ధర యొక్క 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.40,000 గా ఉండే అవకాశం ఉంది.
- ఇక టాప్ మోడల్ Vivo V30 Pro 8జిబి + 256జిబి ధర రూ.45,000 ఉంటుందని సమాచారం.
- ఇప్పటికే వివో వీ30 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. స్పెసిఫికేషన్స్ కూడా గ్లోబల్ వేరియంట్స్ మాదిరే ఉంటాయని అంచనా.
[Exclusive] vivo V30 series Indian price details.
vivo V30 will be priced around Rs 40,000 for the base variant, while the vivo V30 Pro will be priced around Rs 45,000.
V30 Pro will make the debut of ZEISS triple cameras for India and other limited global markets.
No 8MP/2MP… pic.twitter.com/JinIfm3crc— Mukul Sharma (@stufflistings) February 29, 2024
Vivo V30 Pro స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- డిస్ప్లే: Vivo V30 Pro 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ బ్రైట్నెస్, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro 5G లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
- బ్యాటరీ: Vivo V30 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ప్రాసెసర్: Vivo V30 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హై క్లాక్ స్పీడ్ 3.1 గిగాహెర్ట్జ్.
- ఓఎస్: Vivo V30 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo V30 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











