
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో Realme 12 5G, Realme 12+ 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. మార్చి 6న ముంబైలో జరిగే ఈవెంట్ ఈ హ్యాండ్సెట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అయితే లాంచ్‌కి ముందు తాజాగా Realme 12 5G మరియు Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్స్ యొక్క ఇండియన్ మార్కెట్ ధరలు లీక్ అయ్యాయి. ఓసారి లీకైన ధర వివరాలు, డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Realme 12 5G, Realme 12+ 5G ధర
- Realme 12 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.18,999 ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- ఇది టాప్ మోడల్ ధర కాగా, బేస్ వేరియంట్ మరింత చవక ధరకి అందుబాటులో ఉంటుందని సమాచారం.
- Realme 12 5G స్మార్ట్‌ఫోన్ ఉడ్‌ల్యాండ్ గ్రీన్ మరియు ట్విలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 12+ 5G ధర
- Realme 12+ 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,999 గా ఉంటుందని సమాచారం.
- మిగతా వేరియంట్స్ ధరలు రూ.20,000 లోపు ఉండే అవకాశం ఉంది.
- Realme 12+ 5G డివైజ్ పయనీర్ గ్రీన్ మరియు నేవిగేటర్ బీజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- డిస్ప్లే: Realme 12+ 5G లో 6.67-ఇంచ్ ఈ4 అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2400*1080 పిక్సెల్స్), హెచ్డీఆర్10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, రెయిన్వాటర్ స్మార్ట్ టచ్ స్క్రీన్, 50,00,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme 12+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి డైనమిక్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
- కెమెరా: Realme 12+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్వైటీ600 ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Realme 12+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ ఉన్నాయి. ఈ ఫోన్ 163 మి.మీ పొడవు, 75.5 మి.మీ వెడల్పు, 7.9 మి.మీ మందం ఉంది.
- ఇతర ఫీచర్లు: Realme 12+ 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, హై-రెజ్ ఆడియో, ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.











