Samsung: 90Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Galaxy F15 5G

Highlights

  • భారత్ లో లాంచైన Samsung Galaxy F15 5G
  • 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • Samsung Galaxy F15 5G ప్రారంభ ధర రూ.12,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung భారతీయ మార్కెట్ లో నేడు Galaxy F15 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy F15 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F15 5G ధర

  • Samsung Galaxy F15 5G 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధర భారత్ లో రూ.12,999 గా ఉంది.
  • Samsung Galaxy F15 5G 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,499 గా ఉంది.
  • Samsung Galaxy F15 5G కొనుగోలుపై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా అప్‌గ్రేడ్ ఆఫర్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.11,999 కి చేరుతుంది.
  • Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్ జాజీ గ్రీన్ మరియు గ్రూవీ వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy F15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F15 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy F15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Samsung Galaxy F15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy F15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
Previous articleSamsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy M15 5G రెండర్స్
Next articleRealme: లీకైన Realme 12 5G, Realme 12+ 5G భారత మార్కెట్ ధరలు, కలర్ ఆప్షన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.