Nothing: అమోలెడ్ డిస్ప్లే, 12జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Phone (2a)

Highlights

  • భారత్‌లో లాంచైన Nothing Phone 2a
  • ట్రాన్స్‌పరెంట్ డిజైన్ తో వచ్చిన ఫోన్
  • Phone 2a ప్రారంభ ధర రూ.23,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing తాజాగా భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్ లో Nothing Phone 2a డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ యూనిక్ డిజైన్ తో వచ్చింది. ట్రాన్స్‌పరెంట్ రియర్ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంది. Nothing Phone 2a డివైజ్ లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Nothing Phone 2a ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Nothing Phone 2a ధర, లభ్యత

  • Nothing Phone 2a స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో భారత్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.
  • Nothing Phone 2a 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.23,999 గా ఉంది.
  • Nothing Phone 2a 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది.
  • Nothing Phone 2a 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.27,999 గా ఉంది.
  • Nothing Phone 2a ఫోన్‌ని నథింగ్ వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్చి 12 నుంచి కొనుగోలు చేయవచ్చు.
  • స్పెషల్ ఆఫర్ లో భాగంగా, ఫ్లిప్‌కార్ట్ పై ఈ ఫోన్‌ని రూ.19,999 కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ మార్చి 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Nothing Phone 2a డిజైన్

  • Nothing Phone 2a బ్యాక్ ప్యానెల్ పై హారిజంటల్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • ఎల్ఈడీ స్ట్రిప్స్ లైట్ ఈ ఫోన్‌ని మిగతా ఫోన్ల కంటే భిన్నంగా నిలుపుతోంది. గ్లైఫ్ ఇంటర్‌ఫేస్ తో పాటు ఒక రెడ్ కలర్ స్క్వేర్ స్పాట్ ఉంది.
  • Nothing Phone 2a డివైజ్ ముందువైపు ఫ్లాట్ ప్యానెల్ కలిగి ఉంది. ఈ డివైజ్ సన్నని బెజెల్స్ మరియు పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

Nothing Phone 2a స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Nothing Phone 2a లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2412 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Nothing Phone 2a లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ మొబైల్ 7,41,999 పాయింట్లు స్కోర్ చేసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone 2a డివైజ్ 12జిబి ర్యామ్ సపోర్ట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.
  • కెమెరా: Nothing Phone 2a లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Nothing Phone 2a లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Nothing Phone 2a డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Previous articleSamsung: మార్చి 11న లాంచ్ అవుతోన్న Galaxy A55 5G, Galaxy A35 5G
Next articleOPPO: లాంచ్‌కి ముందు లీకైన OPPO K12 స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.