
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో కే-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO K12 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. గతేడాది చైనాలో లాంచైన OPPO K11 కి సక్సెసర్ గా OPPO K12 స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా OPPO K12 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
OPPO K12 స్పెసిఫికేషన్స్ (లీక్)
- టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, OPPO K12 డివైజ్ యొక్క వివరాలను మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో పై షేర్ చేసింది.
- లీక్ ప్రకారం, OPPO K12 డివైజ్ 6.7-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటాయని తెలుస్తోంది.
- OPPO K12 స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో వస్తోంది.
- OPPO K12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
OPPO K11 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.4 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 1100 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్ 10+, 1.07 బిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.
- డిస్ప్లే సపోర్ట్: OPPO K11 5G డివైజ్ ‘లో బ్లూ లైట్ సర్టిఫికేషన్’ పొందింది. ఇంకా ఈ ఫోన్ లో 2160 హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యఎం డిమ్మింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఆటోమేటిక్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది.
- ప్రాసెసర్: OPPO K11 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.70 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. OPPO K11 5G డివైజ్ 7,19,702 పాయింట్ల AnTuTu స్కోర్ నమోదు చేసిందని ఒప్పో చెబుతోంది.
- స్టోరేజీ: OPPO K11 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని ఆఫర్ చేస్తుంది. అంతే కాదు, ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది.
- కెమెరా: OPPO K11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరాతో పాటు మరో రెండు సెన్సర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: OPPO K11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.












