
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ Infinix భారతీయ మార్కెట్ లో ఒక కొత్త స్మార్ట్ 8 సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Smart 8 Plus పేరుతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్ ఉన్నాయి. తక్కువ ధరలో లాంచైన ఈ ఫోన్ ఎంట్రీ-లెవెల్ యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. సరే, ఓసారి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్లు, ధర మరియు లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Infinix Smart 8 Plus ధర, లభ్యత
Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎలా ఉందో చూద్దాం.
భారత్ లో Infinix Smart 8 Plus ధరను రూ.7,799 గా నిర్ణయించారు. గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్ మరియు టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్‌ని కేవలం రూ.6,999 కే సొంతం చేసుకోవచ్చు.
మార్చి 9వ తేదీ నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Infinix Smart 8 Plus సేల్ మొదలవుతుంది.
Infinix Smart 8 Plus స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Infinix Smart 8 Plus లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Infinix Smart 8 Plus డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్, ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ ఉన్నాయి. ఈ మొబైల్ 1,44,895 అంటుటు స్కోర్ నమోదు చేసింది.
- ఓఎస్: Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 Plus డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 2టిబి వరకు పెంచుకునే వీలుంది.
- కెమెరా: Infinix Smart 8 Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ కూడా అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Infinix Smart 8 Plus లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు.
- ఇతర ఫీచర్లు: Infinix Smart 8 Plus లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, జీపీఎస్ + గ్లొనాస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఇంటరాక్టివ్ మ్యాజిక్ రింగ్, టింబర్ టెక్షర్ ప్యాటర్న్, డీటీఎస్ సౌండ్, ట్రిపుల్ కార్డ్ స్లాట్ ఉన్నాయి.
- బరువు, చుట్టుకొలత: Infinix Smart 8 Plus డివైజ్ 163.6 మి.మీ పొడవు, 75.6 మి.మీ వెడల్పు, 8.5 మి.మీ మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది.











