
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V30 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro స్మార్ట్ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo V30 Pro గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ నాలుగు 50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్స్ తో వచ్చింది. ఇంకా ఈ డివైజ్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సరే, ఓసారి Vivo V30 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo V30 Pro స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo V30 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 రెజుల్యూషన్, 2800 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హై క్లాక్ స్పీడ్ 3.1 గిగాహెర్ట్జ్.
- ఓఎస్: Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro డివైజ్ 12జిబి ర్యామ్, 12జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్ కలిగి ఉంది. దీంతో యూజర్ కి 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ 512జిబి వరకు స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది.
- బ్యాటరీ: Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo V30 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
Vivo V30 Pro ధర
Vivo V30 Pro 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.41,999 గా నిర్ణయించారు.
Vivo V30 Pro 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.46,999 గా ఉంది.
Vivo V30 Pro డివైజ్ అండమాన్ బ్లూ మరియు క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
మార్చి 17వ తేదీ నుంచి Vivo V30 Pro సేల్ మొదలవుతుంది. హెచ్డీఎఫ్సీ మరియు ఎస్బీఐ బ్యాంక్ యూజర్లకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.











