Vivo: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Vivo V30

Highlights

  • నేడు భారత్‌లో లాంచైన Vivo V30
  • 12జిబి ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • Vivo V30 ప్రారంభ ధర రూ.33,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V30 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo V30 గురించి తెలుసుకుందాం. వివో వీ30 డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ మోడల్స్ లో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. సరే, ఓసారి Vivo V30 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V30 ధర, లభ్యత

Vivo V30 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.33,999 గా నిర్ణయించారు.

Vivo V30 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.

టాప్ మోడల్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.37,999 గా ఉంది.

Vivo V30 స్మార్ట్‌ఫోన్ అండమాన్ బ్లూ, పికాక్ గ్రీన్ మరియు క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

నేటి నుంచి Vivo V30 ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. మార్చి 14వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు వివో వెబ్‌సైట్ ద్వారా డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు.

Vivo V30 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ 1.5కే డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. హీటింగ్ సమస్యలు లేకుండా అల్ట్రా స్మార్ట్ కూలింగ్ సిస్టమ్ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు 12జిబి వర్చువల్ ర్యామ్ లభిస్తాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Vivo V30 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఏఎఫ్ మరియు ఏఐ ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Previous articleVivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y03, ఎన్‌సీసీ పై లిస్టైన డివైజ్
Next articleVivo: నాలుగు 50MP కెమెరాలతో భారత్‌లో లాంచైన Vivo V30 Pro
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.