Realme: మార్చి 19న భారత్‌లో లాంచ్ కానున్న Narzo 70 Pro 5G

Highlights

  • Narzo 70 Pro 5G ఇండియా లాంచ్ ఖరారు
  • ప్రత్యేకంగా నిలవనున్న ‘ఎయిర్ జెశ్చర్ ఫీచర్’
  • ఐఎంఎక్స్890 సెన్సర్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నార్జో సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme Narzo 70 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. మార్చి 19న ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. రియల్మీ సంస్థ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరాతో వస్తుండటం విశేషం. సరే, ఓసారి ఇండియా లాంచ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Realme Narzo 70 Pro 5G ఇండియా లాంచ్ వివరాలు

Realme Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్ మార్చి 19న భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. మార్చి 19న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ తో పాటు అధికార సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ఈవెంట్‌ను ప్రత్యక్షప్రసారం ద్వారా చూడవచ్చు.

హైలైట్ గా నిలవనున్న Air Gestures

రియల్మీ సంస్థ Narzo 70 Pro 5G లో ఎయిర్ జెశ్చర్ ఫీచర్ ని పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ స్క్రీన్ మరియు యాప్స్‌ని తాకకుండానే ఆపరేట్ చేయవచ్చు. మీ చేతులు తడిగా లేదా మురికిగా ఉన్నప్పుడు, కేవలం వేలు మరియు అరచేతితో కమాండ్స్ ఇవ్వడం ద్వారా ఫోన్‌ని ఆపరేట్ చేయవచ్చు.

ఫోన్ పై యాప్స్‌ని క్లోజ్ చేయడం, స్క్రీన్ స్క్రోలింగ్, స్క్రీన్‌షాట్స్, హోమ్ పేజీ యాక్సెస్ వంటి వాటిని జెశ్చర్స్ ద్వారా చేయవచ్చు.

Realme Narzo 60 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme Narzo 60 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 1260 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160పీడబ్ల్యూఎం డిమ్మింగ్ సపోర్ట్, 9500 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Narzo 60 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి-జీ68 జీపీయూ ఉన్నాయి. ప్రాసెసర్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.
  • కెమెరా: Realme Narzo 60 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Realme Narzo 60 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 47 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవుతుంది.
  • ఓఎస్: Realme Narzo 60 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme Narzo 60 Pro 5G లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.
Previous articleVivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo Y03 ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్
Next articleSamsung: 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన Galaxy A55 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.