Vivo: ఫ్లిప్‌కార్ట్ పేజీ ద్వారా రివీలైన Vivo T3 5G డిజైన్

Highlights

  • త్వరలో Vivo T3 5G లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్‌లో T3 5G మైక్రోసైట్
  • గ్రీన్ కలర్, 8జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo T3 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. సోషల్ మీడియాలో నిన్న వివో సంస్థ T3 5G టీజర్‌ను షేర్ చేసింది. తాజాగా, ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై కనిపించింది. దీంతో ఫోన్ డిజైన్‌తో పాటు ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo T3 5G డిజైన్

Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ యొక్క మైక్రోసైట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోంది. దీని ద్వారా డివైజ్ బ్యాక్ ప్యానెల్ రివీల్ అయ్యింది.

Vivo T3 5G ఫ్లిప్‌కార్ట్ లో గ్రీన్ కలర్ ఆప్షన్ లో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై పిరమిడ్ ప్యాటర్న్‌ని గమనించవచ్చు.

డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. కెమెరా మాడ్యూల్ లో 3 సర్క్యులర్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి.

Vivo T3 5G ఫోన్‌కి కుడివైపున వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఉన్నాయి. బాటమ్ లో వివో బ్రాండింగ్ ఉంది.

Vivo T3 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo T3 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo T3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T3 5G డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo T3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo T3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo T3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo T3 5G లో ఐపీ54 రేటింగ్, డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.
Previous articleiQOO: 16జిబి ర్యామ్ పవర్‌తో భారత్‌లో లాంచైన iQOO Z9 5G
Next articleInfinix: మార్చి 18న లాంచ్ అవుతోన్న Infinix Note 40 సిరీస్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.