POCO: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్‌పై కనిపించిన POCO C61

Highlights

  • త్వరలో POCO C61 లాంచ్
  • మోడల్ నంబర్ 2312BPC51H
  • ధర రూ.8 వేల లోపు ఉండే చాన్స్

Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త సీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO C61 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించింది. దీంతో త్వరలోనే లాంచ్ ఉంటుందని స్పష్టత వచ్చింది. తక్కువ బడ్జెట్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని తీసుకొస్తున్నారు. సరే, ఓసారి POCO C61 యొక్క గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO C61 లిస్టింగ్ వివరాలు

POCO C61 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించింది. POCO C61 కంటే ముందు POCO C65 మరియు POCO C55 ఫోన్లు కూడా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక రాబోవు కొత్త పోకో ఫోన్ మోడల్ నంబర్ 2312BPC51H గా ఉంది.

POCO C61 డివైజ్ Redmi A3 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని అంచనా వేస్తున్నారు. ఇదే గనుక నిజమైతే, POCO C61 ధర కూడా రూ.8,000 వద్ద ఉంటుందని చెప్పవచ్చు. అయితే, POCO C61 యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలు ఇంకా రివీల్ కావాల్సి ఉంది.

Redmi A3 ధర

Redmi A3 స్మార్ట్‌ఫోన్ 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,299 గా ఉంది. 4జిబి + 128జిబి మోడల్ ధరను రూ.8,299 గా పెట్టారు. 6జిబి + 128జిబి మోడల్ ధర రూ.9,299 గా ఉంది.

Redmi A3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi A3 లో 6.71-ఇంచ్ డిస్ప్లే, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ ఉంది. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi A3 డివైజ్ 3జిబి/4జిబి/6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Redmi A3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో వర్షన్) ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi A3 లో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ + గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Previous articleOnePlus: మార్చి 19న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus Ace 3V
Next articleSamsung Galaxy A35 5G ధర వివరాలు తెలుసుకోండి
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.