
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె Galaxy A35 5G ని లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ ధరను రివీల్ చేసింది. Samsung Galaxy A35 5G డివైజ్ ప్రీమియమ్ గ్లాస్ ప్యానెల్ తో రావడంతో లుక్ ఏంతో రిచ్ గా ఉంది. రూ.30 వేల లోపు ఈ ఫోన్ ధరను పెట్టారు. ఓసారి శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A35 5G ధర
Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Samsung Galaxy A35 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.30,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది.
Samsung Galaxy A35 5G డివైజ్ ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ నేవీ మరియు ఆసమ్ లైలాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఐడీఎఫ్సీ, వన్‌కార్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ పై రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది.
Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2340 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Samsung Galaxy A35 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ ఉన్నాయి.
- కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A35 5G ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











