Realme: లాంచ్‌కి ముందు లీకైన Narzo 70 Pro ధర శ్రేణి

Highlights

  • త్వరలో Realme Narzo 70 Pro లాంచ్
  • మార్చి 19న భారత్ లో ఎంట్రీ
  • ధర రూ.20 వేల లోపు ఉండే ఛాన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక కొత్త నార్జో-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme Narzo 70 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. మార్చి 19న భారతీయ మార్కెట్ లో Realme Narzo 70 Pro లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ ధర నెట్టింట్లో లీక్ అయ్యింది. ఈ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని భావిస్తున్నారు. సరే, ఓసారి అంచనా ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme Narzo 70 Pro ధర శ్రేణి (లీక్)

Realme Narzo 70 Pro స్మార్ట్‌ఫోన్ ధర శ్రేణి వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ షేర్ చేశారు. ఈ ఫోన్‌ని రియల్మీ సంస్థ మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ లో పరిచయం చేయనుందని సమాచారం. రూ.20,000 లోపు ఈ ఫోన్ ధర ఉండవచ్చని భావిస్తున్నారు. iQOO Z9 5G తో Realme Narzo 70 Pro పోటీ పడనుంది. ఐకూ జీ9 5జీ రూ.19,999 ప్రారంభ ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది.

Realme Narzo 70 Pro ఇండియా లాంచ్ వివరాలు

Realme Narzo 70 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్ భారత్ లో మార్చి 19వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. కంపెనీ వెబ్‌సైట్ తో పాటు సోషల్ మీడియా హ్యాండిల్స్ పై లాంచ్ కార్యక్రమాన్ని చూడవచ్చు.

ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై Realme Narzo 70 Pro ప్రొడక్ట్ పేజీ ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీన్ని బట్టి, ఈ డివైజ్ అమెజాన్ ద్వారా విక్రయానికి రానుందని తెలుస్తోంది.

Realme Narzo 70 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme Narzo 70 Pro లో పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • కెమెరా: Realme Narzo 70 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ, చార్జింగ్: Realme Narzo 70 Pro లో ఉండే బ్యాటరీ వివరాలు ఇంకా తెలియదు. అయితే 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం.
  • ఎయిర్ జెశ్చర్: Realme Narzo 70 Pro ఫోన్ లో ఎయిర్ జెశ్చర్ ఫీచర్ ని రియల్మీ పరిచయం చేయబోతోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ తమ ఫోన్ స్క్రీన్, యాప్స్‌ని తాకకుండానే ఆపరేట్ చేయవచ్చు.
Previous articleSamsung Galaxy A35 5G ధర వివరాలు తెలుసుకోండి
Next articleSamsung Galaxy A55 5G ధర వివరాలు తెలుసుకోండి
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.