Lava: లాంచ్‌కి ముందు అమెజాన్‌పై లిస్టైన Lava O2, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం

Highlights

  • త్వరలో Lava O2 లాంచ్
  • అమెజాన్ పై లిస్టైన డివైజ్
  • 8జిబి ర్యామ్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో భారతీయ మార్కెట్ లో Lava O2 అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ పై లిస్ట్ అయ్యింది. 8జిబి ర్యామ్ తో ఈ డివైజ్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ గత మోడల్ Lava O1 కి సక్సెసర్ గా వస్తోంది. Lava O1 రూ.6,999 ధరతో మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు రాబోతున్న Lava O2 యొక్క అంచనా ధర మరియు అమెజాన్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lava O2 స్పెసిఫికేషన్స్ (అమెజాన్)

  • స్క్రీన్: Lava O2 స్మార్ట్‌ఫోన్ లో 6.5-ఇంచ్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava O2 లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ఓఎస్: Lava O2 స్మార్ట్‌పోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అవుతుందని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: Lava O2 డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభించనుంది. ఇంకా 128జిబి ఇంటర్నల్ స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.
  • బ్యాటరీ: Lava O2 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Lava O2 ధర (అంచనా)

Lava O2 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇంకా ఈ డివైజ్ కి సంబంధించిన లాంచ్ ప్రకటన రాలేదు. త్వరలోనే లాంచ్ ప్రకటన తో పాటు, సేల్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Lava O2 Specs (Expected)

  • 6.5-inch HD display
  • 90Hz Refresh rate
  • UniSoc chipset
  • 8GB RAM
  • 8GB Virtual RAM
  • 128GB Storage
  • 5,000mAh Battery
  • 18W Fast Charging
  • Android 13 OS
Previous articleVivo: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Vivo Y18
Next articleInfinix: గ్లోబల్‌గా లాంచైన Note 40 Pro 5G, Note 40 Pro+ 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.