TECNO: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన POVA 6 Neo

Highlights

  • త్వరలో TECNO POVA 6 Neo లాంచ్
  • హీలియో జీ99 చిప్‌తో వచ్చే అవకాశం
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO త్వరలో పోవా సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. TECNO POVA 6 Neo పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫ్రంట్ డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

TECNO POVA 6 Neo గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

TECNO POVA 6 Neo స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై TECNO LI6 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

TECNO POVA 6 Neo డివైజ్ 2460*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

TECNO POVA 6 Neo మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోందని అర్థమవుతోంది. లిస్టింగ్ పై MT6789/CD అనే కోడ్ నేమ్ తో ఫోన్ కనిపించింది.

TECNO POVA 6 Neo డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉంటాయని అంచనా వేస్తున్నారు.

TECNO POVA 6 Neo స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

ఓఎస్ విషయానికి వస్తే, TECNO POVA 6 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో రానుంది.

TECNO POVA 6 Neo డిజైన్ (గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్)

TECNO POVA 6 Neo ఇమేజ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

వివరాల ప్రకారం, TECNO POVA 6 Neo డివైజ్ పంచ్-హోల్ కటౌట్ తో వస్తోంది.

TECNO POVA 6 Neo స్మార్ట్‌ఫోన్ లో కుడివైపున పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర వివరాలు ఏమీ రివీల్ కాలేదు.

TECNO POVA 6 Neo స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: TECNO POVA 6 Neo లో 2460*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయని లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
  • ప్రాసెసర్: TECNO POVA 6 Neo డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ తో రానుంది.
  • ర్యామ్, స్టోరేజీ: TECNO POVA 6 Neo డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేసే అవకాశం ఉంది.
  • ఓఎస్: TECNO POVA 6 Neo స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Previous articlePOCO: గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌పై కనిపించిన POCO C61
Next articleSamsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy M55 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.