POCO: గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌పై కనిపించిన POCO C61

Highlights

  • త్వరలో POCO C61 లాంచ్
  • మోడల్ నంబర్ 2312BPC51H
  • హీలియో జీ36 ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. POCO C61 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇది ఆ మధ్య లాంచైన రెడ్మీ ఏ3 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా POCO C61 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో కొన్ని ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

POCO C61 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

POCO C61 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై 2312BPC51H అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజ్ కూడా రివీల్ అయ్యింది.

రివీలైన ఇమేజ్ ని గమనిస్తే, ఫోన్ సెంటర్ పంచ్-హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

POCO C61 లో కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ రాకర్ బటన్స్ కనిపిస్తున్నాయి.

POCO C61 డివైజ్ 720*1650 పిక్సెల్స్ డిస్ప్లే రెజుల్యూషన్ కలిగి ఉంటుందని సమాచారం. అలాగే 320డీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటుందని తెలుస్తోంది.

హార్డ్‌వేర్ విషయానికి వస్తే, గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై POCO C61 డివైజ్ MediaTek MT6765X కోడ్ నేమ్ గల చిప్సెట్ తో కనిపించింది. ఈ చిప్సెట్ మీడియాటెక్ హీలియో జీ36 అయ్యే అవకాశం ఉంది.

POCO C61 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో కనిపించింది.

గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా POCO C61 సంబంధించి మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. గతంలో POCO C61 బ్లూటూత్ ఎస్ఐజీ, బీఐఎస్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

POCO C61 స్మార్ట్‌ఫోన్ గత నెలలో భారతీయ మార్కెట్ లో లాంచైన Redmi A3 కి రీబ్రాండ్ వర్షన్ గా రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓసారి రెడ్మీ ఏ3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi A3 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi A3 లో 6.71-ఇంచ్ హెచ్డీ+ (1650*720 పిక్సెల్స్) డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు.
  • కెమెరా: Redmi A3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Redmi A3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.