Xiaomi: స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్‌తో చైనాలో లాంచైన Civi 4 Pro

Highlights

  • 32ఎంపి+32ఎంపి ఫ్రంట్ కెమెరా సెటప్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్
  • 32ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi చైనాలో Civi 4 Pro స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో వచ్చిన తొలి ఫోన్ Civi 4 Pro కావడం విశేషం. కెమెరా విభాగం కూడా చెప్పుకోదగిన విధంగా ఉంది. ఈ ఫోన్ లో మొత్తం 5 కెమెరాలు ఉన్నాయి. ఇందులో 2 కెమెరాలు ముందు వైపు ఉండగా, మరొక 3 వెనకాల ఉన్నాయి. సరే, ఓసారి Civi 4 Pro యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi Civi 4 Pro ధర

Xiaomi Civi 4 Pro స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi Civi 4 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 2,999 యువాన్లు (సుమారు రూ.35,000) గా నిర్ణయించారు.

Xiaomi Civi 4 Pro 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,299 యువాన్లు (సుమారు రూ.38,500) గా ఉంది.

Xiaomi Civi 4 Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ యూనిట్ ధర 3,599 యువాన్లు (సుమారు రూ.42,000) గా ఉంది.

Xiaomi Civi 4 Pro స్మార్ట్‌ఫోన్ చైనాలో స్ప్రింగ్ వైల్డ్ గ్రీన్, సాఫ్ట్ మిస్ట్ పింక్, బ్రీజ్ బ్లూ మరియు స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Xiaomi Civi 4 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi Civi 4 Pro లో 6.55-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2750*1236 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi Civi 4 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • కెమెరా: Xiaomi Civi 4 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ముందువైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 32ఎంపి + 32ఎంపి కెమెరాలు ఉన్నాయి.
  • బ్యాటరీ: Xiaomi Civi 4 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi Civi 4 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కనెక్టివిటీ: Xiaomi Civi 4 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
Previous articleInfinix: ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కానున్న Note 40 Pro 5G సిరీస్
Next articleOnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Ace 3V
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.