
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఇటీవలె తన సొంత మార్కెట్ లో Xiaomi Civi 4 Pro అనే డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వచ్చింది. అయితే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కాదనే అంతా భావించారు. కానీ, త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే భారత్ లో Xiaomi 14 Civi అనే పేరుతో Civi 4 Pro లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
Xiaomi 14 Civi ఇండియా లాంచ్
Xiaomi 14 Civi స్మార్ట్‌ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని Gizmochina వెబ్‌సైట్ తన కథనం ద్వారా తెలిపింది. త్వరలోనే Xiaomi 14 Civi డివైజ్ యొక్క ఇండియా లాంచ్ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చైనాలో లాంచైన Xiaomi Civi 4 Pro డివైజ్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Xiaomi Civi 4 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Xiaomi Civi 4 Pro లో 6.55-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2750*1236 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
- ప్రాసెసర్: Xiaomi Civi 4 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
- కెమెరా: Xiaomi Civi 4 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ముందువైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 32ఎంపి + 32ఎంపి కెమెరాలు ఉన్నాయి.
- బ్యాటరీ: Xiaomi Civi 4 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: Xiaomi Civi 4 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కనెక్టివిటీ: Xiaomi Civi 4 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











