
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్గా V40 SE 5G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ విదేశాల్లో పలు మార్కెట్స్ లో అందుబాటులో ఉంది. స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 16జిబి ర్యామ్ (8జిబి+8జిబి), 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా Vivo V40 SE 5G ధరను ప్రకటించలేదు. సరే, ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo V40 SE 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo V40 SE 5G లో 6.67-ఇంచ్ పంచ్-హోల్ కటౌట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఈ4 అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రా విజన్ అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ బ్రైట్నెస్, 107% కలర్ శాచురేషన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo V40 SE 5G లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
- కెమెరా: Vivo V40 SE 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Vivo V40 SE 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











