Samsung: IP67 రేటింగ్‌తో బ్రెజిల్‌లో లాంచైన Galaxy M55 5G

Highlights

  • గ్లోబల్‌గా Samsung Galaxy M55 5G లాంచ్
  • 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా
  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Samsung Galaxy M55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. బ్రెజిల్ మార్కెట్ లో ప్రస్తుతం ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. త్వరలోనే భారత్ సహా ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. Samsung Galaxy M55 5G లో ఐపీ67 రేటింగ్, 6.7-ఇంచ్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉన్నాయి. ఓసారి Samsung Galaxy M55 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M55 5G ధర, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy M55 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర BZR 2,699 (సుమారు రూ.45,024) గా ఉంది. ఈ ఫోన్ లైట్ గ్రీన్ మరియు డార్క్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. త్వరలో Samsung Galaxy M55 5G భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ ప్లస్ స్క్రీన్, పంచ్-హోల్ డిజైన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్ వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బరువు, మందం: Samsung Galaxy M55 5G 180 గ్రాముల బరువు, 7.8మి.మీ మందం ఉంటుంది.
  • ఇతర పీచర్లు: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.
Previous articleVivo: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన V40 SE 5G
Next articleOnePlus: లాంచ్‌కి ముందు లీకైన Nord CE 4 ఇండియా ధర
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.