
Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Note 13 Turbo అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ డివైజ్ తొలుత చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత భారతీయ మార్కెట్ లోకి POCO F6 పేరుతో ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. స్నాప్‌డ్రాగన్ చిప్సెట్, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి లీకైన వివరాలను తెలుసుకుందాం పదండి.
Redmi Note 13 Turbo స్పెసిఫికేషన్స్ (లీక్)
Redmi Note 13 Turbo డివైజ్ వివరాలను మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో ద్వారా టిప్‌స్టర్ షేర్ చేశారు.
Redmi Note 13 Turbo డివైజ్ లో ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టీయాన్నా అండ్ టీసీఎల్ స్క్రీన్ ఉంటాయని లీక్ ద్వారా తెలుస్తోంది.
Redmi K70e ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంటుందో అలానే Redmi Note 13 Turbo ఫ్రంట్ లుక్ ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
ఇక Redmi Note 13 Turbo యొక్క రియర్ డిజైన్ Redmi Note 12 Turbo మరియు Note 13 Pro+ మాదిరి ఉంటుంది.
లీక్ ప్రకారం, Redmi Note 13 Turbo డివైజ్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 20ఎంపి సెల్ఫీ కెమెరా, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయని తెలుస్తోంది.
Redmi Note 13 Turbo డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది.
Redmi Note 13 Turbo లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని టిప్‌స్టర్ ద్వారా రివీల్ అయ్యింది.
Redmi Note 13 Turbo ధర (లీక్)
Redmi Note 13 Turbo డివైజ్ యొక్క లాంచ్ తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. కానీ, కంపెనీ నుంచి డివైజ్ ఇమేజ్ షేర్ చేయబడింది. ఇక లీక్ ప్రకారం, Redmi Note 13 Turbo ఫోన్ ధర RMB 1,999 (సుమారు రూ.23,000) ఉంటుందని తెలిసింది.
Redmi Note 13 Turbo డిజైన్ (లీక్)
Redmi Note 13 Turbo స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజ్ ని కంపెనీ అధినేత షేర్ చేశారు. దీంతో డిజైన్ ఎలా ఉంటుందో రివీల్ అయ్యింది.
Redmi Note 13 Turbo డివైజ్ లో పంచ్ హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ కనిపిస్తున్నాయి.
Redmi Note 13 Turbo డివైజ్‌కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉన్నాయి.
Redmi Note 13 Turbo స్మార్ట్‌ఫోన్ లో పవర్ బటన్ పైకి కనిపిస్తోంది. అంటే ఈ డివైజ్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తోందని అర్థమవుతోంది.











