
Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Turbo సిరీస్ రానుంది. ఈ సిరీస్ లో భాగంగా Redmi Turbo 3 స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ కానుంది. తాజాగా రెడ్మీ కంపెనీ టీజర్ ఇమేజ్ ద్వారా Redmi Turbo 3 లాంచ్‌ని కన్ఫర్మ్ చేసింది. అయితే అంతకుముందు ఈ ఫోన్ Redmi Note 13 Turbo పేరుతో వస్తుందని అనుకున్నారు. కానీ, అది నిజం కాదని కంపెనీ టీజర్ తో స్పష్టమైంది. టర్బో సిరీస్ ని వేరుగా తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. సరే, టీజర్ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Redmi Turbo 3 లాంచ్ టీజర్
Redmi Turbo 3 స్మార్ట్‌ఫోన్ లాంచ్ టీజర్‌ని రెడ్మీ కంపెనీ విడుదల చేసింది. దీంతో డివైజ్ లాంచ్ పై స్పష్టత వచ్చింది.
Redmi Turbo 3 డివైజ్ ఈ నెలలోనే లాంచ్ అవుతుందని టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
కొత్త తరం, ఫ్లాగ్షిప్ లెవెల్ పెర్ఫామెన్స్ ని అందించేందుకు రెడ్మీ సంస్థ ఈ టర్బో సిరీస్ ని తీసుకొస్తోంది.
గతంలో టర్బో ఫోన్లు నోట్ సిరీస్ లో భాగంగా వచ్చేవి. ఇప్పుడు మాత్రం టర్బో ప్రత్యేకంగా ఓ సిరీస్ గా వస్తోంది. టర్బో సిరీస్ లో ఇంకా ఏయే ఫోన్లను కంపెనీ లాంచ్ చేయనుందో చూడాలి.

Redmi Turbo 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Redmi Turbo 3 లో 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Redmi Turbo 3 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Redmi Turbo 3 డివైజ్ 12జిబి వరకు ర్యామ్ మరియు 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించే అవకాశం ఉంది.
- కెమెరా: Redmi Turbo 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
- బ్యాటరీ: Redmi Turbo 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
Redmi Turbo 3 స్మార్ట్‌ఫోన్ తొలుత చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత Poco F6 పేరుతో భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది.











