
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నార్డ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. OnePlus Nord CE 4 5G పేరుతో ఈ ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. వన్‌ప్లస్ ఫోన్లకు భారత్ లో జనాదరణ చాలా ఎక్కువే. దీంతో వన్‌ప్లస్ నుంచి ఏ ఫోన్ లాంచైనా యూజర్లు ఆసక్తిగా గమనిస్తారు. తాజాగా లాంచైన OnePlus Nord CE 4 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 100 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి OnePlus Nord CE 4 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం పదండి.
OnePlus Nord CE 4 5G ధర, కలర్ ఆప్షన్స్
OnePlus Nord CE 4 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఓసారి వాటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
OnePlus Nord CE 4 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా నిర్ణయించారు.
OnePlus Nord CE 4 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 5జీ ఫోన్ డార్క్ క్రోమ్ మరియు సెల్డన్ మార్బుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OnePlus Nord CE 4 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 5జీ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఫ్లూయిడ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
- ప్రాసెసర్: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 5జీ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు.
- ఓఎస్: OnePlus Nord CE 4 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 4 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
- కెమెరా: OnePlus Nord CE 4 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్వైటీ600 మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ ఐఎంఎక్స్355 లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: OnePlus Nord CE 4 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
- కనెక్టివిటీ: OnePlus Nord CE 4 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, యూఎస్బీ టైప్-సీ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
- సెక్యూరిటీ: OnePlus Nord CE 4 5G భద్రత కోసం ఐపీ54 రేటింగ్ ని అందించారు.











