Tecno: 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Pova 6 4G

Highlights

  • గ్లోబల్‌గా లాంచైన Tecno Pova 6
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్‌
  • 70W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Tecno గ్లోబల్‌గా Pova 6 4G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ Tecno Pova 6 త్వరలో భారత్ లో కూడా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్, డైనమిక్-టెక్ డిజైన్ తో వచ్చింది. టెక్నో పోవా 6 లో 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 12జిబి ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Tecno Pova 6 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Tecno Pova 6 ధర, కలర్ ఆప్షన్స్

Tecno Pova 6 ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ప్రకటన వస్తుంది. అలాగే భారతీయ మార్కెట్ లో పోవా 6 ఎప్పుడు లాంచ్ కానుందో కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tecno Pova 6 కామెట్ గ్రీన్, మీటియోరైట్ గ్రే మరియు ఇంటర్‌స్టెల్లార్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Tecno Pova 6 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Pova 6 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2436 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ టీయూవీ రెయిన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Pova 6 లో మీడియాటెక్ హీలియో జీ99 అల్టిమేట్ చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Pova 6 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా అందించారు. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Tecno Pova 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ముందువైపు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • బ్యాటరీ: Tecno Pova 6 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.
  • ఓఎస్: Tecno Pova 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Previous articleVivo: 80W ఫాస్ట్ చార్జింగ్‌తో రష్యాలో లాంచైన V30 Lite 4G
Next articleMotorola: త్వరలో లాంచ్ కానున్న Edge 50 Fusion, తాజాగా లీకైన టీజర్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.