Vivo: 80W ఫాస్ట్ చార్జింగ్‌తో రష్యాలో లాంచైన V30 Lite 4G

Highlights

  • రష్యాలో లాంచైన Vivo V30 Lite 4జీ
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ మార్కెట్ లో V30 Lite యొక్క కొత్త మోడల్‌ని లాంచ్ చేసింది. రష్యన్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ప్రవేశించింది. మెక్సికో, యూఏఈ దేశాల్లో లాంచైన వేరియంట్ కి రష్యన్ మోడల్ కి తేడా ఉంది. రెండింట్లో చిప్సెట్ ఒకటి కాదు. ఈ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రష్యాలో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Vivo V30 Lite 4G డివైజ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V30 Lite స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo V30 Lite 4G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V30 Lite 4G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Lite 4G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చింది. యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.

కెమెరా: Vivo V30 Lite 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo V30 Lite 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo V30 Lite 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

Previous articleMotorola: 125W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన Edge 50 Pro 5G
Next articleTecno: 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Pova 6 4G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.