OPPO A3 Pro లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • ఏప్రిల్ 12న OPPO A3 Pro లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ సహా ఇతర మార్కెట్లలోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా OPPO A3 Pro యొక్క లాంచ్ తేదీ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

OPPO A3 Pro 5G లాంచ్ తేదీ

OPPO A3 Pro స్మార్ట్‌ఫోన్ చైనాలో ఏప్రిల్ 12న లాంచ్ అవుతోంది. ఇదే రోజున మధ్యాహ్నం 2.30 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం, ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో ద్వారా లాంచ్ ఈవెంట్‌ని లైవ్ లో చూడవచ్చు.

OPPO A3 Pro 5G ఫోన్ గీక్‌బెంచ్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 12జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. గతేడాది లాంచైన OPPO A2 Pro కి సక్సెసర్ గా OPPO A3 Pro 5G డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది.

OPPO A2 Pro 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OPPO A2 Pro 5G లో 6.70-ఇంచ్ 3డీ అమోలెడ్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A2 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • మెమొరీ: OPPO A2 Pro 5G డివైజ్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: OPPO A2 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OPPO A2 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
  • ఇతర ఫీచర్లు: OPPO A2 Pro 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లు ఉన్నాయి.
Previous articleVivo: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Vivo V30e
Next articleSamsung: డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy M15 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.