
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారత్ తో సహా వివిధ మార్కెట్లలో V30 సిరీస్‌ని లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో వచ్చిన Vivo V30, V30 Pro స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వివో నుంచి ఇదే సిరీస్ లో మరో ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. Vivo V30e పేరుతో రానున్న ఈ డివైజ్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Vivo V30e బీఐఎస్ లిస్టింగ్
Vivo V30e డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై V2339 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. MySmartPrice తొలుత ఈ విషయాన్ని గుర్తించింది.

గతంలో Vivo V30e డివైజ్ ఈఈసీ, కెమెరా ఎఫ్‌వీ-5, బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్ పై కనిపించింది.
ఇటీవలె బ్లూటూత్ ఎస్ఐజీ డేటాబేస్ లిస్టింగ్ ద్వారా Vivo V30e పేరు ఖరారైంది.
Vivo V30e స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Vivo V30e లో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. అయితే స్క్రీన్ సైజ్ ఎంతో ఇంకా రివీల్ కాలేదు.
- ప్రాసెసర్: Vivo V30e లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలిసింది.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V30e డివైజ్ 8జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. అయితే ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- కెమెరా: Vivo V30e డివైజ్ కెమెరా ఎఫ్‌వీ-5 డేటాబేస్ పై కనిపించింది. ఈ ఫోన్ లో 50ఎంపి రియర్ కెమెరా, ఈఐఎస్ సపోర్ట్, ఎఫ్/1.8 అపర్చర్, 35ఎంఎం ఫోకల్ లెంగ్త్, 4096*3072 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ఆపరేటింగ్ సిస్టమ్: Vivo V30e డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.











