
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో రెండు ఎమ్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. Samsung Galaxy M55 5G, Samsung Galaxy M15 5G అనే పేర్లతో ఈ డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy M55 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 6.7-ఇంచ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy M55 5G ధర, కలర్ ఆప్షన్స్
Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఓసారి వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Samsung Galaxy M55 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.32,999 గా నిర్ణయించారు.
Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ లైట్ గ్రీన్ మరియు డెనిమ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రారంభ సేల్‌లో భాగంగా కంపెనీ రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 16 మిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
- కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి 4 మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
- బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అందించిన సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ కేవలం బ్యాటరీని ఫాస్ట్ గా చార్జ్ చేయడమే కాదు, ఇంకా వేడెక్కకుండా చూస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 5Ghz, యూఎస్బీ టైప్-సీ 2.0, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.











