
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో కొత్త లైనప్ రియల్మీ పీ-సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని రియల్మీ వైస్ ప్రెసిడెంట్ చేస్ జూ X ఖాతా ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. రియల్మీ నుంచి రాబోయే P-Series ప్రత్యేకించి భారతీయ మార్కెట్ కోసం డిజైన్ చేయబడిందని చేస్ జూ తెలిపారు. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
త్వరలో వచ్చేస్తున్న Realme P సిరీస్
మిడ్-రేంజ్ అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు సరికొత్త పీ-సిరీస్ ని పరిచయం చేయబోతున్నట్లు రియల్మీ వైస్-ప్రెసిడెంట్ జూ చేస్ తెలిపారు.
పీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్లు యువత కోసం తీసుకొస్తోన్న వాల్యూ డ్రైవెన్ డివైజెస్ అని తెలుస్తోంది.
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Realme P సిరీస్ ఫోన్లు అమ్మకానికి వస్తాయని కంపెనీ తెలిపింది.
పీ-సిరీస్ లో భాగంగా రాబోయే ఫోన్లు 5జీ సపోర్ట్ తో రానున్నాయి. ఇదే విషయం కంపెనీ ప్రమోషనల్ బ్యానర్స్ లో కనిపిస్తోంది. పీ-సిరీస్ ద్వారా మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని రియల్మీ టార్గెట్ చేయనుంది. భారత్ లో 2023 వరకు రియల్మీ 100 మిలియన్ (10 కోట్లు) డివైజెస్ అమ్మినట్లు జూ చేస్ తెలిపారు.
ఇప్పటి వరకు రియల్మీ సంస్థ పీ-సిరీస్ గురించి తెలిపిన వివరాలు ఇంతే. అయితే టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Realme P1, Realme P1 Pro ఫోన్లు ఈ నెలలో భారత్ లో లాంచ్ అవుతాయని తెలిపారు.
Exclusive ?
Realme P1
? MediaTek Dimensity 7200Realme P1 Pro
? Qualcomm Snapdragon 6 Gen 1 (most probably)#realme #realmeP1 #RealmeP1Pro pic.twitter.com/m3eKvluqP9— Abhishek Yadav (@yabhishekhd) April 8, 2024
Realme P1, Realme P1 Pro స్మార్ట్‌ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్స్ తో రానున్నట్లు సమాచారం.
POCO X-సిరీస్ కి పోటీగా రియల్మీ కంపెనీ పీ-సిరీస్‌ను తీసుకొస్తున్నట్లు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో పీ-సిరీస్ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.











